అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్ట్ ఎర్రం నర్సింగ్ రావు మృతి…….

హైదరాబాద్ ,(సిరా న్యూస్);
సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి ఎర్రం నర్సింగ్ రావు సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందారు.ముప్పై ఏళ్ళుగా ఈనాడు దినపత్రికలో లోకల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న నర్సింగ్ రావు జర్నలిస్టు ఫెడరేషన్ వ్యవస్థాపకుల్లో ప్రధాన పాత్ర వహించారు. సంఘం తరపున తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ కు నర్సింగ్ రావు గారు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గా పని చేశాం. అంతకుముందు హైదరాబాద్ జర్నలిస్ట్స్ యూనియన్ కార్యదర్శి గా పని చేశారు. సంఘం బాధ్యుడిని జర్నలిస్టుల సమస్యలపై చిత్త శుద్ధితో, అంకిత భావంతో నిస్వార్థంగా పని చేశారు. వృత్తి పట్ల కూడా అంకితభావంతో పనిచేశారు. గత రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. నిరంతరం మెడిసిన్ వాడుతూ అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి ఆదివారం రాత్రి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున హఠాత్తుగా మృతి చెందారు. నర్సింగ్ రావు కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నర్సింగ్ రావు మృతికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం తెలియజేస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. నర్సింగ్ రావు సంఘానికి చేసిన సేవలు మరువలేనివి. ఆయన మరణం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కు తీరని లోటని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *