Vinod Kumar..అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది..

సిరా న్యూస్, చిగురుమామిడి:

అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది..

కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ చేసింది శూన్యం

వేలకోట్ల రూపాయలతో కరీంనగర్ ను అభివృద్ధి చేశాను 

మళ్లీ ఎంపీగా గెలిపించండి.

బిఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్.

అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ కు చేసింది శూన్యమని అన్నారు. వేలకోట్ల రూపాయలతో కరీంనగర్ కు స్మార్ట్ సిటీ, హైదరాబాద్ టు సిద్దిపేట్ రైల్వే లైన్, రాజివ్ రహదారి వంటి అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.2001 లో అనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వస్తుందని ఎగతాళి చేశారని… కెసిఆర్ నాయకత్వంలో ఐదుగురు ఎంపీలు గెలిచి పార్లమెంట్లో తెలంగాణ సాధన కోసం 32 పార్టీలను ఒప్పించి, ప్రధానమంత్రి రాష్ట్రపతి,సోనియా గాంధీని సైతం ఒప్పించి తెలంగాణను తీసుకొచ్చామని గుర్తు చేశారు.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు వరకు చేస్తానంటే రైతులు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.కరువు కాంగ్రెస్ తెచ్చిందేననీ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల కాలేశ్వరంలోనీ నీళ్లను సముద్రం పాలు చేశారని అన్నారు.తెలంగాణ హక్కులు సాధించాలంటే గులాబీ ఎంపీలు పార్లమెంట్లో ఉండాలని కారు గుర్తుకు ఓటేసి తనని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ... గోదావరి జలాలను ఇందుర్తి సైదాపూర్ మండలానికి తెచ్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీ దేనాని అన్నారు.

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమ బాలకిషన్ మాట్లాడుతూ వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ జంగ రమణారెడ్డి, కొత్త శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *