అంబర్ పేట ,(సిరా న్యూస్);
*అంబర్ పేట నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశా.. మీ సమస్యలను తీర్చా..మీ ఓటును కారు గుర్తుపై వేసి తనను అత్యధిక జారిటితో గెలిపించాలని బిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్, పిలుపునిచ్చారు. ఆదివారం నాడుబాగ్ అంబర్ పేట డివిజన్ డిడి కాలనీ ఏ, బి, సి లైన్స్ ప్రాంతాల్లో కార్పొరేటర్ శ్రీమతి పద్మా వెంకటరెడ్డి, డివిజన్ అధ్యక్షులు చంద్ర మోహన్ మరియుపార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార పాదయాత్రలో పెద్ద సంఖ్యలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తనకన్నా ముందు మూడు సార్లు గెలిచిన కిషన్ రెడ్డి గాని అంత ముందుకు గెలిచిన నాయకులు గానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని, పదవులు అనుభవించి నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేసారనిఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహకారంతో వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేసి అభివృద్ధికి అంబర్పేట ను అడ్రస్ గా మార్చాలని ఆయన అన్నారు. టిఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పథకాలు యధావిధిగా కొనసాగాలంటే అంబర్పేట నుంచి తిరిగి తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.