సిరా న్యూస్,నందికొట్కూరు ;
అభివృద్ధి ప్రజా సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగనన్న ద్యేయమనీ మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు రవి యాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో వై నీడ్ ఏపీ జగన్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన బోర్డును ఆవిష్కరించి వైఎస్ఆర్సిపి జెండాను ఎగరవేశారు. వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ జగనన్న కు మద్దతుగా నిలవాలని కోరారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు సంక్షేమ పథకాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మురళీకృష్ణ రెడ్డి, జెసిఎస్ కన్వీనర్ ఓంకార్ రెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పబ్బతి రవి, ఎంపిటిసి దేవమ్మ, శాతన కోట సర్పంచ్ జనార్ధన్ గౌడ్ జనార్దన్ గౌడ్, వడ్డేమాను గ్రామ వైఎస్సార్సీపీ ఇంఛార్జి కట్టా చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు సుబ్బన్న, ఎన్ వెంకట్రెడ్డి, అశోక్ రెడ్డి, రవీంద్ర నాయుడు, జబ్బార్, తదితరులు పాల్గొన్నారు.