సిరా న్యూస్,విజయవాడ;
ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు చాలా గుంభనంగా అసలేమీ తెలియనట్లు ఉంటారు వారు ప్రత్యక్షంగా ప్రజలలోకి రారు. సర్వేలు చేయరు. విశ్లేషణలు చెప్పరు.. కానీ, రాజకీయ క్షేతంలో ఎక్కడెక్కడఏమేం జరుగుతోందో ఇట్టే పట్టేస్తారు. పసిగట్టేస్తారు. రాజకీయలతో అసలు ఏమాత్రం సంబంధం లేనట్లుండే వీరు ఆ రాజకీయ పరదాల చాటున ఏం జరుగుతుందో కళ్ళు మూసుకుని కూడా చూసేయగలరు. అందుకు తగ్గట్టుగా తమ స్ట్రాటజీలు మార్చుకుంటారు. ఇప్పడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు వరసగా క్యూ కట్టి మరీ రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే నిజాన్ని అధికారులు ఇప్పటికే.. ఇప్పటికే ఏమిటి ఎప్పుడో పసిగట్టారు. అందుకే, అలా ఒకరివెంట ఒకరుగా ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏదో విధంగా చంద్రబాబును కలుసుకునేందుకు తహతహలాడుతున్నారు. నిజానికి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే, జగన్మోహన్ రెడ్డి అధికారులను అడ్డగోలుగా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు బుక్కయ్యారు. జైలు పాలయ్యారు. అలాగే జగన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సీఎస్, డీజీపీలతో సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుబోనెక్కారు. అవమానాలు ఫేస్ చేశారు. చీవాట్లు తిన్నారు. అయినా తాము చేసిది, చేస్తున్నది తప్పేనని తెలిసినా కొందరు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారుల ఒత్తిళ్ళకు తలొగ్గి పని చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను అనేక విధాల వేధింపులకు గురిచేశారు.