అర్ధం కానీ జనసేనాని వైఖరి

ఏలూరు, నవంబర్ 20, (సిరా న్యూస్)

నేడు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు అవుతుంది. అయితే రెండుచోట్ల ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఎవరి పాలన వారిది. ఎవరి అధికారం వారిది. కానీ జాతీయ పార్టీలు రెండు చోట్ల కాలు మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ఎవరిదీ తప్పు కాదు. అధికారం కోసం ఎవరైనా ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. పొత్తులు మాత్రమే. ప్రధానంగా ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు జైలు జీవితాన్ని 52 రోజుల పాటు గడిపి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. నిర్ణయాలను కూడా మార్చుకోవాల్సి వచ్చింది. జైలు నుంచే తాము తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి టీడీపీ పక్కకు తప్పుకుంది. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఈసారి మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చంద్రబాబు జైలుకు వెళ్లకముందు ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టారు. మరోసభను కూడా పెట్టాలని నేతలకు సూచించారు. అంతేకాదు ఈసారి టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. అప్పటి వరకూ బీజేపీతో తమతో ఏపీలో కలుస్తుందన్న నమ్మకంతోనే ఆ కామెంట్స్ చేశారంటారు. తెలంగాణలోనూ కమలం పార్టీతో పొత్తుకు ఆయన ప్రయత్నించినా సాధ్యపడలేదు. పైగా తాను జైలుకు వెళ్లడానికి పరోక్షంగా బీజేపీ హస్తం ఉందని భావించిన చంద్రబాబు ఎన్నికల బరి నుంచి తప్పుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఏపీలో జనసేనతో అధికారిక పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు ఇక్కడ మాత్రం పరోక్షంగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక కాంగ్రెస్ సమావేశాల్లో టీడీపీ శ్రేణులు పాల్గొంటుండటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తులో ఉంది. జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తుంది. ముఖ్యంగా జనసేన ఖమ్మం నియోజకవర్గంలో పోటీకి దిగింది. కానీ ఖమ్మంలో టీడీపీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతు తెలుపుతుండటం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *