అవకాశం ఇస్తే అందరికీ న్యాయం చేస్తా

..

కమాన్ పూర్
మంథని నియోజకవర్గం నుండి అవకాశం ఇస్తే అందరికీ సరైన న్యాయం చేస్తానని మంత్రి నియోజక వర్గ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే అభ్యర్థి సాగి అజిత్ రావు అన్నారు. ఈ మేరకు ఫార్వర్డ్ బ్లాక్ మేనిఫెస్టోను వివరించారు.మా పోరాటానికి మీ వోట్ ద్వారా బలపరచాలని కోరారు. మేనిఫెస్టోలో
ఉచిత విద్య …: (విద్య తో వ్యాపారం చేస్తున్న ప్రవైట్ సంస్థలను పూర్తిగా నిర్ములించడం ద్వారా ప్రభుత్వమే ఉచితంగా విద్యను అందరికి అందించాలి …ప్రైవేట్ వ్యవస్థలు లేకుండా చేస్తేనే ప్రభుత్వం అందించే ఉచిత విద్యలో నాణ్యత పెరుగుతుంది అని ప్రజల విశ్వసనీయత ).
ఉచిత వైద్యం : (వైద్యం తో వ్యాపారం చేస్తున్న ప్రవైట్ సంస్థలను పూర్తిగా నిర్ములించడం ద్వారా ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందరికి అందించాలి …ప్రైవేట్ వ్యవస్థలు లేకుండా చేస్తేనే ప్రభుత్వం అందించే ఉచిత వైద్యం నాణ్యత పెరుగుతుంది అని ప్రజల విశ్వసనీయత ).
సత్వర న్యాయాం/ఉచిత న్యాయ సలహాలు : ఉచితంగా న్యాయాన్ని ప్రజలకు అందించటం .కోర్టు లలో కేసులు సాగదీత ధోరణితో సంవత్సరాలు గడపకుండా ఒక నిర్దిష్టమయిన సమయవ్యవధి లో కేసు లు పూర్తిచేసే విదంగా వ్యవస్థను రూపకల్పన చేయటం .
వృద్దులకు ,వికలాంగులకు ,వితంతువులకు న్యాయమయిన పెన్షన్ విధానం .
దేశానికి తిండి పెట్టె రైతన్నకు అత్యుతమయిన ప్రోత్సహకాలు అందించి …యువత వ్యవసాయం మీద మక్కువ చూపేలా ప్రోత్సహించటం .
ప్రజలకు మౌలిక వసతులు అందిస్తూ ,ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరిచే విదంగా ఉపాధి అవకాశాలు కల్పించటం జరుగుతుందని తెలిపారు. తనను గెలిపిస్తే మంథనియోగ వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *