విశాఖపట్నం,(సిరా న్యూస్);
బుధవారం జరిగిన స్కూల్ ఆటోలారీ ప్రమాదం తో అధికారులు నిద్ర మేల్కోన్నారు. గురువారం నాడు నగరంలో ఆర్టీవో అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఏక కాలంలో మూడు చోట్ల తనిఖీలు నిర్వహించారు. మద్దిలపాలెం, ఎన్ఏడి, గాజువాక ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బుధవారం నాడు 28 ఆటోలు సీజ్ చేసారు. గురువారం నాడు 16 కేసులు నమోదు చేసారు. ఐదు ఆటోలు సీజ్ చేసారు. ఒక ఆటోలో గరిష్టంగా ఆరుగురు ఉండాలని అధికారులు సూచించారు. ఆటో కి 8-10 మంది ఉంటే రూ.1000 చలానా విధించారు. 10 మందికి మించి ఉంటే ఆటో ను సీజ్ చేసారు. ఆటో డ్రైవర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.