సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
ఆధార్ కేంద్రం ఏర్పాటుకు వినతి
-జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసిన ఉత్తం ముఖడే
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉత్తం ముఖడే కోరారు. బుధవారం ఆయన, కాంగ్రెస్ నాయకులు నాగొరావ్ తో కలిసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి మండల వాసులు ఆధార్ అప్డేట్ కోసం ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ మండల కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటుకు సాధ్యసాధలను పరిశీలించి, ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు వారు వెల్లడించారు.