పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పై అందిస్తున్న ప్రత్యేక కథనం…..
ప్రజలే ఆయన ఊపిరి.. ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన ఎజెండా.. నియోజకవర్గ అభివృద్ధే ఆయన లక్ష్యం..నిరుపేదల కష్టాలకు చలించిపోయే తత్వం.. నిరంకుశ విధానాలను ఎండగట్టే ధీశాలి.. పేద ,ప్రజల ఆత్మ బంధువు ఆయనే పాలేరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి.
ఖమ్మం జిల్లా, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే నియోజకవర్గ ప్రజల ఆదరాబిమానాలు చూరగొన్నారు. ఇక్కడి ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందు వరుసలో నిలబడతారు. ఆపద వచ్చిన వారిని ఆర్థికంగా ఆదుకుంటూ ఆపద్బంధువుడిలా మారారు. నియోజకవర్గ ప్రజలను ఆదుకునేందుకు తన క్యాంపు కార్యాలయంలోనే ఉంటూ జనం మెచ్చిన నేతగా కీర్తింప బడ్డారు.
మరణించిన వ్యక్తుల కుటుంబాల్లో నేనున్నాను అంటు గెలుపొందిన నాటి నుంచి ఈ నాటి వరకు కూడా ముందు వరుసలో నిలబడ్డ వ్యక్తి “కందాల”… ఏదో సినిమాలో చెప్పినట్లుగా ఎప్పుడొచ్చామన్నది కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించామా..? లేదా..? అన్నదే ఆయనకు ముఖ్యం. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అద్వితీయం. నియోజకవర్గంలో నూతనంగా పలు చోట్ల రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. పేద ప్రజల ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా ఆర్థిక సహాయం అందించి ఆ ఇంటికి పెద్దన్నలా నిలుస్తున్నారు. ఎంతో మంది పేద విద్యార్థులను చదివించి వారికి ఓ దారి చూపించిన మహోన్నత వ్యక్తి కందాళ. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడే సైనికుడు. జనమే ఆయన బలం. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు కార్యకర్తలను పేరు పెట్టి పిలిచి ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనది. నీతి, నిజాయితీలకు కేరాఫ్ కందాళ. సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఆయనను అమితంగా అబిమానిస్తారంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో తిరుగులేని ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుట్టింది దొరల కుటుంబంలో అయినా తన ఆలోచనలన్నీ పేద ప్రజల సంక్షేమం పైనే. ఆయనలో ఎమ్మెల్యే అనే దర్పం ఏ కోశాన కనిపించదు. అయనకు పేదలే ఆత్మ బంధువులు.
======================