రామగుండం ,(సిరా న్యూస్);
రామగుండంలో ఆర్.ఎఫ్.సి.ఎల్ తెరిపించింది కాంగ్రెస్ పార్టీ.. అయితే ఉద్యోగాలు అమ్ముకున్నది స్థానిక స్థానిక ఎమ్మెల్యే అని,కొలువుల కోసం డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇప్పిస్తానని రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి ఎం. ఎస్.రాజ్ ఠాకూర్అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం లక్ష్మిపురం గేట్ లో జరిగిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ఎఫ్.సి.ఐ మూత పడితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్.ఎఫ్.సి.ఎల్ ను తెరిపించిందాని అన్నారు. మన స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయాని అనుకుంటే స్థానిక ఎమ్మెల్యే కొంత మండి దళారులను పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే ఉద్యోగాలు అమ్ముకున్నడాని, అప్పులు చేసి, పుస్తెలు అమ్ముకొని, భూములు అమ్ముకొని డబ్బులు పెడుతె ఉద్యోగాలు రాక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నరని ఆరోపించారు.. ఆర్.ఎఫ్.సి.ఎల్ లో నష్టపోయిన ఆస్తులను జప్తి చేసి అయిన బాధితులకు పూర్తి స్థాయి డబ్బులు ఇప్పిస్తానని అన్నారు.ఎల్కలపల్లి నుండి సబ్బితం వరకు 100 ఫిట్ల రోడ్డు వెపిస్తానని, ఈ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. యువ వికాసం ద్వారా విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, పెళ్లి చేసుకునే మహిళకు తులం బంగారం ఇస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని అన్నారు.