సిరా న్యూస్, ఆదిలాబాద్:
తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే ఆదిలాబాద్ ను అభివృద్ధి చేసి చూపిస్తానని, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అల్లూరి సంజీవ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ మండలంలోని కచ్ కంటి, యాపల్ గూడ, బుర్నూర్, శివఘాట్, రాంపూర్, రామయి తదితర గ్రామాల్లో టిపిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డిసిసి మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం గావించారు. ఉంగరం గుర్తుకు ఓటువేసి తనను ఎమ్మేల్యేగా గెలిపిస్తే ఆదిలాబాద్ లో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా కృషిచేస్తానని అన్నారు. మాజీ మంత్రివర్యులు, స్వర్గీయ సి రామచంద్ర రెడ్డి ఆశయ సాధన దిశగా, దగా పడ్డ ఆదిలాబాద్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, ఎన్నికల బరిలో నిలిచిన తనకు ప్రజలంతా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.