కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజు
పెద్దపల్లి, (సిరా న్యూస్)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం సిద్ధ రామయ్య ఆద్వర్యంలో పక్కాగా అమలు చేస్తున్నామని కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నాగరాజు స్పష్టం చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్, ఇతర రాజకీయ పార్టీలు కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడం లేదని చేస్తున్న దుష్ప్రచారాల ను ఆయన ఖండించారు. కర్ణాటకలో రోల్ మోడల్ గా పథకాలు అమలు చేస్తూ ప్రజల మనస్సులు గెలుచుకున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. తమ రాష్ట్రానికి వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలే వివరిస్తారని తెలిపారు. అక్కడి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను తెలంగాణకు తరలించి కాంగ్రెస్ పై అబద్ద ప్రచారాలు చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టో అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో యాదవ సంఘం నాయకులు తమ్మడబోయిన ఓదెలు యాదవ్, సందనవేన రాజేందర్ యాదవ్, గుండెటి ఐలయ్య యాదవ్, కొమ్ము సంపత్ యాదవ్, మారం మల్లేష్ యాదవ్, రాజం శంకర్, తదితరులు పాల్గొన్నారు.