సిరా న్యూస్, చిగురుమామిడి:
ఈనెల 10న గౌడ సోదరుల ఐత్మీయ సమ్మేళనం…
గౌడ కులబందువులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయంతం చేయాలి…
గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లిపల్లి శ్రీనివాస్ గౌడ్
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి తెంగాణ ఉద్యమనేత అంచలంచలుగా ఎదిగిన లీడర్ రాష్ట్ర రవాణా,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఉమ్మడి కరీంనగర్ జిల్లాగౌడ సంఘాల ఐక్యవేధిక ఆధ్వర్యంలో గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనంను మార్చి 10న ఆదివారం కరీంనగర్ లోని వి కన్వెన్షన్ బొమ్మకల్ బైపాస్ రోడ్డులో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాం వద్ద గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనం కరపత్రాలను మండల నాయకులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ విష్కరించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మార్చి 10న ఆదివారం నిర్వహించే అత్మీ సమ్మెళనం కార్యక్రమానికి గౌడ కుల బంధువులు ప్రతి గడప నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా కోశాధికారి పొన్నం శ్రీనివాస్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి మాచెర్ల అంజన్నగౌడ్, గౌడ సంఘం మండల అధ్యక్షులు బొమ్మగాని వెంకటేశు గౌడ్,జిల్లా ఉపాధ్యాక్షులు బుర్ర పరశురాములు గౌడ్, పైడిపెల్లి చంద్రయ్యగౌడ్,బుర్ర తిరుపతి, పూదరి వేణుగోపాల్ గౌడ్,మార్క రాజు గౌడ్,పచ్చిమట్ల జగన్, బొడిగే పర్శరాములు గౌడ్, బొమ్మగాని పరుశరాములు గౌడ్,పచ్చిమట్ల మధుసుదన్ గౌడ్,బుర్ర సమ్మయ్య,బురుగు సంజీవ్, బొమ్మగాని రాజు తదితరులు పాల్గొన్నారు.