సిరా న్యూస్, హైదరాబాద్:
ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారంటీల అమలు..
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క..
ఈనెల 27 నుంచి మరో రెండు గ్యారంటీల అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ నెల 27 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు చేయనున్నట్లు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ప్రారంభిస్తారని తెలిపారు భట్టి విక్రమార్క.
కాగా, గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని అటు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.