సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఉచిత బస్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
-జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ను కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం సందర్శించారు. బస్టాండ్ లో మహిళలతో మాట్లాడి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ… జిల్లాలో ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బస్సు సర్వీసులు పెంచాలని సూచించారు. చదువుకునే విద్యార్థినిలు, మహిళా ఉద్యోగులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.