ఉద్యోగుల లెక్కల ఆరా తీస్తున్న ఎన్నికల సంఘం

సిరా న్యూస్,నెల్లూరు;
మరో నాలుగునెలల్లో  సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే ఏపీలోనూ ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ చేస్తోంది. దీనిపై వచ్చే వివాదాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సిబ్బంది ఎంపికపై ఈసీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణలో  పాలు పంచుకునే ఉద్యోగుల వివరాలను ఈసీ కోింది. జిల్లాల్లోని అన్నిశాఖల వివరాలు, కేటగిరీల వారీగా పంపాలని కోరారు.  అన్నిశాఖల అధికారులతోపాటు ఎన్నికల సంఘం ఆదేశాలతో విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల వివరాలు కేటగిరీలవారీగా సేకరించి పంపనున్నారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ అంశంలో ఉపాధ్యాయుల్ని దూరం పెట్టాలని అనుకుంటోంది. అందు కోసం 2022 నవంబరు 29న విద్యా హక్కు చట్టంలోని నిబంధనలకు వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసింది. టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదంటూ అప్పట్లో జీవో జారీచేసింది. ఒకవేళ ఏవైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి అదనపు సిబ్బంది అవసరమైతే… అన్ని శాఖల ఉద్యోగులను వినియోగించిన అనంతరం అవసరమైతే మాత్రమే టీచర్ల సేవలు వాడుకోవాలని స్పష్టంచేసింది.   ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉపాధ్యాయులే ఎక్కువగా  కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈసీ ప్రత్యేకంగా  ఈ విషయాన్నితన ఉత్తర్వుల్లో పేర్కొంది.  2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్‌ అధికారులుగా విధుల్లోకి తీసుకోవడంపై సంసిద్ధత జాబితాను సిద్ధం చేయాలంటూ ఎంఈవోలను కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు క్యాడర్‌వైజ్‌గా డిసెంబరు 25లోపు జిల్లా   ఎన్నికల అధికారికి పంపాలని జిల్లా ప్రజాపరిషత్‌, మున్సిపల్‌, మోడల్‌ స్కూల్‌, ఇతర పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *