సిరా న్యూస్,తుగ్గలి;
మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి పనులు కల్పించి,వలసలను అరికట్టి,ఫేస్ యాప్ ను రద్దు చేయాలని కోరుతూ బుధవారం వ్యవసాయ కార్మిక సంఘము నాయకులు ఎంపీడీఓ సావిత్రి కు వినతి పత్రం అందచేశారు.ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘము మండల కార్యదర్శి శ్రీరాములు,రైతు సంఘము నాయకులు రంగరాజు మాట్లాడుతూ ప్రతి కూలికి 200 రోజులు పని దినాలను కల్పించాలని,రోజు వేతనం కేరళలో మాదిరిగా రు.600 ఇవ్వాలని,తుగ్గలి మండలంలోని అన్ని గ్రామాలలో జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలికి పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు ఉద్యోగులు మాదిరిగా ఏర్పాటు చేసిన ఫేస్ యాప్ ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామాలలో ఉపాధి పనులు లేకపోవడంతో చాలా మంది కూలీలు బ్రతుకు దెరువు కోసం సూదుర ప్రాంతాలకు వలసలు వెళ్లడం జరుగుతుంది అన్నారు.ఎప్పటికయినా ప్రభుత్వం స్పందించి కూలీల డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘము నాయకులు,ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు