సిరా న్యూస్ ఆదిలాబాద్
ఎంఎల్ ఏ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నేతలు..
జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలుపొందిన పాయల్ శంకర్ కి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ రాష్ట్రవ్యాప్తంగా బిజెపికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో వారి పిలుపును గౌరవించిన నియోజవర్గ పరిధిలోని మాదిగ ఉప కులాల ప్రజలు నా గెలుపుకు నిండు మనసుతో సహకరించిన వారికి ముఖ్యంగా నా గెలుపు కోసం కష్టపడ్డా ఎమ్మార్పీఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి లు ఆరెపల్లి సురేష్ , చంద మోహన్, దుబ్బాక సుభాష్ ,మచ్చ గంగయ్య , ఇండ్ల రాజు ,ఆరెపల్లి గణేష్, అల్లకొండ రవి ,మేకల జితేందర్ ,చిట్టీ రవి, రోడ్డ రాజశేఖర్ రాకేష్ ,దుబ్బాక చందు ,మోడీ పల్లి మనోజ్, తరుడి శంకర్, రేంజర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు..