డిసిసి వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
డాక్టర్ వంశీకృష్ణ గత 15 సంవత్సరాలుగా పార్టీని కాపాడుతూ, ఓడిపోయిన పార్టీకి అంకిత భావంతో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పని చేశారని అదేవిధంగా జిల్లాలోని నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకున్నారని, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఇప్పుడు జిల్లాలో అత్యధిక మెజారిటీ ,రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో రెండవ స్థానం లో నిలిచిన డాక్టర్ వంశీకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు అన్నారు. అచ్చంపేట ప్రాంతం నల్లమల ప్రాంతమని, చెంచులు ,ఆదివాసి ప్రజలు లంబడిలు, గిరిజనులు దళితులు అత్యధికంగా ఉన్నాయి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే డాక్టర్ వంశీకృష్ణ గారికి మంత్రి పదవి ఇచ్చి తీరాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర భరత్ కుమార్, అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.