ఎస్పీ గౌస్ ఆలం ను సన్మానించిన రెడ్డి యువజన సంఘం నాయకులు…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

ఎస్పీ గౌస్ ఆలం ను సన్మానించిన రెడ్డి యువజన సంఘం నాయకులు…

ఆదిలాబాద్ జిల్లాకు నూతన ఎస్పీగా నియమితులైన గౌస్ ఆలం ను రెడ్డి యువజన సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు. బుధవారం ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్డి యువజన సంఘం ఆధ్వర్యంలో కరోనా సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి ఎస్పీకి విన్నవించారు. ఈనెల 28 నుండి జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *