సిరా న్యూస్,అమరావతి.
రాజ్యాంగ బద్ధమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్న బక్కి వెంకటయ్య మీద దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. వెంకటయ్య పార్టీ కండువా వేసుకుని అప్పటి అధికార బీఆర్ఎస్ కు ప్రచారం చేశారు. డబ్బుల పంపిణీ తో పాటు మందు, విందు లు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం పని చేశారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉంటూ ఎన్నికల ప్రచారం చేసిన బక్కి వెంకటయ్య పై చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పకుండా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం అని గవర్నర్ హామీ ఇచ్చారని అయన అన్నారు.