10ఏళ్లలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని కేసీఆర్ … తన కుటుంబంలో మాత్రం అందరికీ పదవులిచ్చుకున్నడు.. మనవడికి వయసు లేదు కానీ… అతనికి కూడా పదవి ఇచ్చే వాళ్లు… ప్రజలు కేసీఆర్ పాలనపట్ల విసిగిపోయిర్రు. డిసెంబర్ 4 నుండి కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నడు.,..
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధికి కరీంనగర్ నియోజకవర్గం గురించి ఏమీ తెల్వదు. ఆయనకు పేదలకు ఏం చేయాలో, కరీంనగర్ ను అభివ్రుద్ధి ఎట్లా చేయాలో తెల్వదు. తెలిసిందల్లా భూకబ్జాలు చేయడమే.. ఆయనపై ఉన్నవన్నీ కబ్జా కేసులే…
గంగుల కమలాకర్, పురమళ్ల శ్రీనివాస్ ఎన్నడైనా మీకోసం కొట్లాడి జైలుకు పోయారా? మీ లెక్క నాకూ భార్యాపిల్లలున్నరు. మీరు హోటల్ కు, ఫంక్షన్లకు, సినిమాలకు పోతారు.. కానీ నేను భార్యాపిల్లలతో సినిమాలకు వెళ్లలేదు. ఫంక్షన్లకు పోలేదు.. మీకోసం కొట్లాడుతుంటే.. ప్రత్యర్థులు ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెల్వని పరిస్థితి… పాతబస్తీలో సభ పెడితే నా భార్యాపిల్లలను చంపుతామని బెదిరించారు. ప్రజల కోసం ఎంతకైనా తెగించాలని నా కుటుంబాన్ని పక్కనపెట్టి సభ పెట్టిన.ప్రజల కోసం పోరాడుతున్న నా మీద 74 కేసులున్నయ్. అవన్నీ ఎవరి కోసం? మీకోసం కొట్లాడిన. పేదల సమస్యలపైన, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం కొట్లాడితే కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులు… ఒక్కసారి ఆలోచించండి… ఎంపీగా పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.8 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. కరీంనగర్..జగిత్యాల, కరీంనగర్..వరంగల్ జాతీయ రహదారి నిర్మాణం కోసం నిధులు తెచ్చిన. స్మార్ట్ సిటీకి నిధులు తెచ్చిన. గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివే నని అన్నారుబీజేపీ కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్.