హైదరాబాద్,(సిరా న్యూస్);
ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించే దిశగా “లెటస్ వోట్” అనే స్వచ్చంద సంస్థ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 5 కె రన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ వికాస్ రాజ్, తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్,మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి జండా ఊపి 5 కే రన్ ను ప్రారంభించారు.ఈ పాల్గొన్నారు.ప్రజాస్వామ్యం లో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత పై ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖులు ప్రసంగించారు.
కొత్తగా ఓటు హక్కు పొందిన యువతి యువకులు ,పలు ఐటీ కంపెనీల ఉద్యోగులు మరియు స్కూల్ విద్యార్థులు “లెట్స్ ఓట్” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ఈ రన్ లో పాల్గొన్నారు.