కడప పాత బస్టాండ్ లో జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలి
సిరా న్యూస్,కడప;
రోజురోజుకు పాత బస్టాండ్ లో దొంగతనాలు పెరుగుతున్నాయని వాటిని అరికట్టాల్సిన ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సీసీ కెమెరాలు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రయాణికుల వస్తువులను డబ్బులను దొంగలు సులభంగా దొంగతనాలు చేసుకుంటున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కడప నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు ఆవేదన వ్యక్తం చేశారు
స్థానిక పాత బస్టాండ్లో నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొరికిన కాడికి పరుసులు, సెల్ ఫోన్లు,డబ్బులు,బ్యాగులు విలువైన వస్తువులు చోరీలు చేస్తూన్నారనారు కడప పాత బస్టాండ్ లో ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారన్నారు పోలీస్ వారు దృష్టి సరిగ్గా పెట్టక పోవడం చేత ,సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయక పోవడం, సీసీ కెమెరాలు చూపుడుకు మాత్రమే పనికొస్తున్నాయి కానీ పనిచేయడం లేదు వెంటనే పోలీస్ వారు సీసీ కెమెరాలను ఉపయోగం లేక పెట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు మరియు అధిక మొత్తములో ఆర్టీసీ వారు సెర్చ్ చార్జీల పేరుతో పెద్ద మొత్తంలో ప్రజల నుండి ధనాన్ని అర్జిస్తున్నారు కానీ ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అందించడం లేదు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న చిల్లర దొంగలపైన ప్రత్యేకమైన నిఘా వుంచి ప్రజల యొక్క వస్తువులను వారి ధనాన్ని కాపాడవలసిందిగా డివైఎఫ్ఐ కడప పట్టణ కమిటీ డిమాండ్ చేస్తుంది 26 నవంబర్ 2023 వ తేదీన ఒక మహిళ పాత బస్టాండ్ లో తన పర్సును అందులోని 25 వేల రూపాయలను సెల్ ఫోను పోగొట్టుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పోగా అక్కడ సీసీ కెమెరాలను పరీక్షించండి అని అడగగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారు తెలపడం జరిగింది ఆర్టీసీ వారిని అడగగా సీసీ కెమెరాలు మా పరిధిలో లేవని అవి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారు పర్యవేక్షణలో ఉన్నాయని చెప్పారని వారు తెలిపారన్నారు ఆర్టీసీ వారు మెరుగైన వసతులు కలిగించాలి పోలీసు వారు వెంటనే పాత బస్టాండ్ లోని సీసీ కెమెరాలను ఉపయోగం లోకి తీసుకురావాలని, పోలీసు వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని డివైఎఫ్ఐ కడప కమిటీగా డిమాండ్ చేస్తున్నమన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు విజయ్ సహాయ కార్యదర్శి యూసఫ్ నాయకులు నాగార్జున, జగదీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు