సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ‘బాబు ష్యూరిటీ, భవష్యత్తుకు గ్యారంటీ’కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జి కన్నా లక్ష్మీనారాయణపై ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి దిగారు. పథకం ప్రకారం లైట్లు ఆర్పివేసి భవనాలపై నుంచి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి