కరీంనగర్ డెయిరీ సేవలు అభినందనీయం…

సిరా న్యూస్, చిగురుమామిడి:

కరీంనగర్ డెయిరీ సేవలు అభినందనీయం…

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా కరీంనగర్ డెయిరీ ముందుకెళ్తున్న తీరు అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కరీంనగర్ డైరీలో సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… పాల ఉత్పత్తిదారుల గ్రామ సంఘాల పనితీరును అభినందించారు. రోజుకు 1650 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తూ మొదటి స్థానంలో నిలిచిన సుందరగిరి గ్రామ పాల ఉత్పత్తిదారుల సంఘం, రోజుకు 1350 లీటర్ల పాలన ఉత్పత్తి చేస్తూ రెండవ స్థానంలో నిలిచిన నవాబుపేట ఉత్పత్తిదారుల సంఘాలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సుందరగిరి, నవాబుపేట గ్రామాల పాల ఉత్పతిదా రుల సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి సంపత్ గౌడ్ ను, గుళ్ల రవి లను కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు, నాబార్డ్ డిజిఎమ్ శ్రీహారి, ఏజీఎమ్ స్వాతి, డిడిఏం జయ ప్రకాశ్, ఆర్జీఎమ్ శ్రీలత, కెడిసిసి బ్యాంకు సీఇవో సత్యనారాయణరావు, పద్మనగర్ బ్రాంచ్ మెనేజర్ సుజాత, డెయిరీ అడ్వజర్లు డాక్టర్ బి హన్మంత్ రెడ్డి, డాక్టర్ పందిళ్ల శంకర్ రెడ్డి, బొర్డు డైరక్టర్ మారుపాక రాజు,డెయిరీ మర్కెటింగ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, పాల ఉత్పతిదారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *