సూర్యాపేట ,(సిరా న్యూస్);
ఆర్యవైశ్యులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు సూర్యాపేటలోని రవి మహల్ లో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఒక ఆర్య వైశ్య నాయకుడు రోశయ్యకు ముఖ్యమంత్రి గా సేవ చేసే అవకాశం లభించిందని ఇంతమంది ఆర్యవైశ్యులకు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అవకాశాలు కనిపించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు. ఆర్యవైశ్యులు స్వతహాగా తమ సొంత వ్యాపారాలు చేసి ఎవరిని ఇబ్బంది కలిగించకుండా బ్రతుకుతారని వారిది ఒకరికి పెట్టే చెయ్యి తప్ప అడుక్కుని తీసుకునే ఆలోచనలు ఉండవని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ కొరకు తన సొంత ఆస్తులు అమ్ముకున్న తనకు రాజకీయాన్ని వ్యాపారం చేసి కోట్లు కూడా పెట్టి అధికార ధన బలంతో విర్రవీగుతున్న ఇంకో నేతకు మధ్య జరుగుతున్న పోటీలో ఆర్యవైశ్యులు తనకు మద్దతు పలకాలని ఆయన అన్నారు. ప్రశాంతమైన సూర్యాపేట ప్రగతి బాటలో నడిపించాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని సూర్యాపేటలో కాంగ్రెస్ గెలవాలని అందుకు వ్యాపారవర్గాలంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు