సిరా న్యూస్, ఆదిలాబాద్:
కాంగ్రెస్, బిజేపి పార్టీలను నమ్మి మోసపోవద్దని, ఆదిలాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మేల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు గ్రామస్తులు డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సదర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్, ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు ఉండాలంటే మళ్ళీ కేసీఆర్ సీఎం రావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.