సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఓసీ జేఏసీ మండల అధ్యక్షుడు మామిడి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. జైనథ్ మండలం మాండగాడ గ్రామానికి చెందిన ఆయన గత కొన్ని సంవత్సరాలుగా బిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైందని ఆయన అన్నారు. డబుల్ బెడ్ రూమ్ లు, దళిత బంధు, బీసీ బందు, రుణమాఫీ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ మేరకు ఆయన ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కంది శ్రీనివాస రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు.