సిరా న్యూస్, ఆదిలాబాద్:
నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తూ తమ పథకాలుగా చెప్పుకుంటుందని ఆదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రం, పిప్పల్ గావ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా పలువురు పార్టీలో చేరేందుకు ముందుకు రాగా కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్యే జోగు రామన్న గత పదేళ్ల కలంలో ఆదిలాబాద్ నియోజక వర్గానికి చేసింది ఏమిలేదన్నారు. గ్రామాలకు వేసిన రోడ్లు బీజేపీ కేంద్రప్రభుత్వ నిధులతో, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా వేయించినవే అని అన్నారు. గ్రామా పంచాయతీల్లో హరితవనాలు, స్మశాన వాటికలు, రైతు వేదికలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మంచినవెనని అన్నారు. గ్రామాల్లోని పేదల కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నదేనని అన్నారు. సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్నట్టు కేంద్రం నిధులతో చేపట్టిన పథకాలకు, రాష్ట్ర ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకుని ప్రచారం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఇలాంటి బిఆర్ఎస్ కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని, రానున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.