దేవస్థానం కార్య నిర్వహణ అధికారి రామకృష్ణ. (సిరా న్యూస్)
పాణ్యం
ప్రముఖ శైవ క్షేత్రం పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల త్రాగునీటి సౌకర్యార్థం మోటార్ పంపును భక్తులు శుక్రవారం విరాళంగా సమర్పించినట్లు దేవస్థానం ఈవో రామకృష్ణ తెలిపారు. బేతంచెర్ల పట్టణమునకు చెందిన కామిరెడ్డి సుబ్బారెడ్డి మనవరాలు కామిరెడ్డి సుష్మ కీర్తిశేషులు చదువుల సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం మనవడు నాగ రుద్రాన్స్ రెడ్డి శ్రీ స్వామి వారు వారి ఇంటి ఇలవేల్పు కావడంతో 2 H.p సింగల్ ఫేస్ 20 స్టేజ్ గల CRI పంపును పైపులు విరాళంగా అధికార సిబ్బంది అర్చకులకు అందజేశారని, వారికి ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, సురేష్ శర్మ, ఆలయ సిబ్బంది క్లర్క్ సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, దాతల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.