నల్గోండ, (సిరా న్యూస్);
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో.. నడవలేని స్థితిలో ఉన్న వృద్దులు, వికలాంగులకు అర్హులైన వారికి ఇంటి నుంచే ఓటు వేసే “హోం ఓట్ కాస్టింగ్” కొనసాగుతుంది. అర్హులైన వారికోసం ఈ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఫామ్-12 D దరఖాస్తు చేసుకున్నవారికి.. అర్హులైన 80 ఏళ్ళు దాటిన వృద్దులు, 40 శాతానికి పైబడి నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు.. కొన్ని చోట్ల 27 వ తేదీ లోపు హోమ్ ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో మాదిరిగానే పోలింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ సహా బ్యాలెట్ బాక్స్ వంటి వాటితో ఓటర్ ఇంటి దగ్గరికి టీం సెక్యూరిటీతో సహా వెళ్తుంది. ఇక ..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. 17 వెల 383 మంది 80 ఏళ్లకు పైబడిన వృద్దులకు.. 32 వేల 302 మంది అస్సలు నడవలేని స్థతిలో ఉన్న దివ్యాంగులు హోం ఓటింగ్ సౌకర్యాలు వినియోగించుకోనున్నారు.