పల్నాడు,(సిరా న్యూస్);
పిడుగురాళ్ల మండలం లోని, కొనాంకి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే ఇంటిలో ముగ్గురు హత్యకు గురికావడంతో గ్రామస్థులు నివ్వెరపోయారు. స్థానికంగా వుంటున్న అనంత సాంబశివరావు, ఆదిలక్ష్మీ దంపతల కుమారుడు నరేష్ ముగ్గురుని నరేష్ భార్య మాధురి బంధువులు కత్తితో నరికి హతమార్చారు. నరేష్ దంపతుల మధ్యల గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అమ్మాయి తరపున ఆమె తండ్రి, అన్న వచ్చి, నరేష్ , అతని తల్లిదండ్రులతో గొడవ పడ్డారు. ఘర్షణ ముదిరి కత్తితో దాడి చేసారు. , దాంతో నరేష్, అతడి తల్లి దండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన తరువాత మాధురితండ్రి దోమా సుబ్బారావు, అన్న శ్రీనివాస్ రావు, మాధురి ముగ్గురు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పిడుగురాళ్ల పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు….