కోర్టుల చుట్టూ ఏపీ రాజకీయాలు

విజయవాడ, (సిరా న్యూస్);
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించేవారు.భూ కేటాయింపులు,మంత్రివర్గ ఆమోదంలో కుండా చేసే నిర్ణయాలపై కోర్టుకు వెళ్లేవారు. ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో కేసులకు వెళ్లి అడ్డుకోవడం అరుదు.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలపై కోర్టులను ఆశ్రయించడం పెరిగిపోయింది.ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ పాలసీని ప్రకటించినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోర్టును ఆశ్రయించడం పరిపాటిగా మారింది. వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ఇష్టారాజ్యంగా కోర్టులో పిటిషన్ వేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి.ఒకానొక దశలో వైసిపి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాలపై కోర్టుల ప్రభావం అధికంగా ఉండేది. చాలా పథకాల విషయంలో సైతం ప్రతికూల తీర్పులు వచ్చాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అటు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోగా..ఇటు విపక్షాలు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతోఏపీ విషయంలో కోర్టులో పిటిషన్లు పెరిగిపోయాయి. న్యాయస్థానాల జోక్యం అనివార్యంగా మారింది. ఈ విషయంలో ఎల్లో మీడియా వాదన కూడా వింతగా ఉండేది. చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంటే ఒప్పు.. జగన్ సర్కార్ తీసుకుంటే తప్పు అన్న కోణంలోఎల్లో మీడియా వ్యవహరిస్తూ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *