క్రీడలతోనే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు 67వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ రగ్బీ పోటీలలో ప్రతిభ రగ్బీ పోటీలలో గెలుపొందిన డి. అయేషా సిద్దిక,  బి.ప్రశాంత్ లకు మెడల్, సర్టిఫికేట్ ప్రధానం      ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభినందన సభ  

నందికొట్కూరు,(సిరా న్యూస్);
పట్టణ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు చదువుతోపాటు క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. షేక్షావలి తెలిపారు . గురువారం నంద్యాల జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నందికొట్కూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ  జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న డి. ఆయేషా సిద్దిక, మొదటి సంవత్సరం చదువుతున్న బి.ప్రశాంత్ లు కర్నూలులోని, ఆదర్శ జూనియర్ కాలేజ్ లో జరిగిన 67వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ రగ్బీ బాల,బాలికల పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో గెలుపొందడంతో వీరికి మెడల్, మెరిట్ సర్టిఫికేట్ ప్రధానం చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.షేక్షావలి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభలో కర్నూలు పట్టణంలోని జరిగిన 67వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ రగ్బీ పోటీలలో వీరిద్దరు కూడా మన కర్నూలు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించినట్లు ఆయన తెలిపారు . విద్యార్థులకు చదువుతోపాటు ఆటల పోటీలు, ఎంతో ఉత్సాహాన్ని, తమ ప్రతిభ చాటుకోవడానికి, , అటు తల్లిదండ్రులకు మంచి పేరుతో పాటు కళాశాల యాజమాన్యానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. కృషి పట్టుదలతో జాతీయస్థాయి గేమ్స్ లలో  కూడా గెలుపొంది గోల్డ్ మెడల్స్ సాధించాలన్నారు. ఇటువంటి క్రీడాకారులకు, కళాశాల తరపు ఎప్పుడు సహకారం ఉంటుందని ఆయన సూచించారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ జి. వన్నూర్ వలి, పిడి,రియాజుద్దీన్, ఇతర అధ్యాపకులు, వైఎస్ఆర్సిపి నాయకులు డి,షరీఫ్, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *