సిరా న్యూస్, సైదాపూర్:
క్రీడలతోనే మానసికోల్లాసం..
– మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్..
క్రీడలతోనే మానసికోల్లాసం సాధ్యమని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. వెన్కేపల్లి-సైదాపూర్ మండలంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన అక్కన్నపేట మండలం జనగాం జట్టు, రెండవ స్థానంలో నిలిచిన సైదాపూర్ మండలం శివరాంపల్లి జట్లకు ఎమ్మెల్యే బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… క్రీడలు మానసిక, శారీరక ఒత్తిడిని దూరం చేసి, మనసుకి ఉత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. యువత క్రీడా రంగంలో రాణించి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, మండల ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ చందా శ్రీనివాస్, యువకులు పాల్గొన్నారు.