సిరా న్యూస్,గన్నవరం;
గన్నవరం లో తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి జనసైనికులు టిడిపి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. టిడిపి కార్యాలయం ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ నాయకులు బండ్రేడ్డి రామకృష్ణ, చలమల శెట్టి రమేష్ తదితరులు హజరయ్యారు.
యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ 1999 లో ఇదే పార్టీ కార్యాలయం పై టీడీపీ జెండా ఎగిరింది 2009 లో ను ఇదే కార్యాలయం పై టీడీపీ జెండా ఎగిరింది. 2024 లో కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు తో సమిష్టి గా కలిసి పనిచేసి ఇదే పార్టీ కార్యాలయం పై టీడీపీ జెండా ఎగరేస్తాం. గన్నవరం లో టీడీపీ జెండా ఎగర వేయడమే కాకుండా అమరావతి లో కూడా టీడీపీ జెండా ఎగరేస్తాం. గన్నవరం టికెట్ గెలిపించి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి కి కనుక గా ఇస్తా అంటూ ధీమా వ్యక్తం చేసారు.