సిరాన్యూస్ ,సూర్యాపేట:
గానుగబండ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవము..
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం జెడ్పిహెచ్ఎస్ గానుగ బండ పాఠశాలలో డిసెంబర్ 22న గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థులు అంకెల రూపంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వనం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… గణితం యొక్క గొప్పతనాన్ని, భవిష్యత్తులో విద్యార్థులకు గణితం ఉపయోగపడే విధానాన్ని వర్ణించారు. గణిత ఉపాధ్యాయుడైన గోవింద్ విద్యార్థులతో ముచ్చటిస్తూ శ్రీనివాస రామానుజన్ జీవితాన్ని ఆయన గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగయ్య , మణికుమారి, తదితరులు పాల్గొన్నారు..