సిరా న్యూస్, జైనథ్:
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా…
– జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల జడ్పిటిసి సభ్యులు తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం జైనథ్ మండలం లేకర్ వాడ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 4 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నాయకులు, స్థానికులతో కలిసి భూమిపూజ చేసారు. ఈ సదర్భంగా టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్త శుద్ధితో పని చేస్తుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆశయాలకనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన సాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్,అల్లూరి భూమ రెడ్డి, యాల్ల పోతా రెడ్డి, మాజీ ఎంపీపీ తల్లెల చంద్రయ్య, మాజీ సర్పంచ్ ఉష్కం దౌలత్, నాయకులు తల్లెల దాసు, మార్చేట్టి హన్మాండ్లు, ఉష్కం యాదవ్, తల్లెల భూమ రెడ్డి, తల్లెల ఆడేల్లు, అరిగేల మహేష్, తల్లెల రాకేష్, బురే పాండురంగ్, సంద రమాకాంత్, ఆకుల రామ రావు, చిందం మోహన్, షేక్ బాబా, షేక్ హుస్సేన్, ఆకుల వెంకటి, షేక్ కాజా, షేక్ చాంద్ సాబ్, జక్కుల దేవన్న, తదితరులు పాల్గొన్నారు.