సిరా న్యూస్, కరీంనగర్:
ఘనంగా సంక్రాంతి సంబరాలు…
గ్రామంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలు గాలిపటాలు ఎగురవేసి రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి హరిదాసు వేషధారణలో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపారు. పాఠశాల యాజమాన్యం పాఠశాలలో పనిచేసే సిబ్బందికి సంక్రాంతి బోనస్ గా ఆయిల్ ప్యాకెట్స్ ఉచితంగా పంపిణీ చేయడం చేసారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పల సమ్మయ్య మాట్లాడుతూ..పిల్లలకు విద్యతోపాటు మానసిక ఉల్లాసానికి ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని రకాల పండుగలు పాఠశాలలో జరుపుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందేలా మా పాఠశాల కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు కరస్పాండెంట్ కూన సంపత్ ఉపాధ్యాయులు మంజుల, రూప, రమ్య, సన అఫ్రీన్, సంధ్య, సమత, శైలజ, మైకేల్, స్వాగతిక డిగల్, సావిత్రి మాలిక్, తదితరులు పాల్గొన్నారు