చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి.. -డాక్టర్ నివేదిత

సిరా న్యూస్, భీమదేవరపల్లి:

చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..

-డాక్టర్ నివేదిత

అప్పుడే పుట్టిన పసి కందుల నుండి 5 సంవత్సరాల్లోపు చిన్నారులందరికీ తప్పక పోలియో చుక్కలు వేయించాలని, భీమదేవరపల్లి మండలంలోని మల్లారం సబ్ సెంటర్ డాక్టర్ నివేదిత అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ఏ కారణం చేత అయినా ఈరోజు పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నివేదిత, ఏఎన్ఎం గీత, అంగన్వాడి టీచర్ శోభారాణి, మల్లారం గ్రామపంచాయతీ కార్యదర్శి రాజు, ఆశా కార్యకర్తలు ఎలీషా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *