విజయవాడ,(సిరా న్యూస్);
జగ్గంపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రెండు లారీలను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. అయితే, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడ నుంచి ప్రయాణికులతో వైజాగ్ వెళుతున్న ఎస్ కే వీడి ట్రావెల్ బస్సు, జగ్గంపేట జేవియర్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి వెనకనుంచి ట్రాలీని ఢీకొని, రోడ్ సైడ్ ఆగి ఉన్న కంటైనర్ను బస్సు ఢీకొట్టింది. దీంతో రోడ్ సైడ్ కి కంటైనర్ లారీ పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు వున్నారు. బస్సులో ప్రయాణికులకు, లారీ డ్రైవర్లకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు