జమిలితో దేశప్రజలకే ప్రయోజనం చేకూరుతుంది
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికల ఆలోచనకు మద్దతు ఇవ్వాలని
రాజకీయ పార్టీలను కోరిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్
లక్నో , (సిరా న్యూస్);
జమిలి ఎన్నికల పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు దేశప్రయోజనాలతో ముడిపడిన అంశమని అన్నారు. జమిలితో దేశప్రజలకే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కోవింద్ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఒకే దేశం – ఒకే ఎన్నికకు మద్దతు తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికల ఆలోచనకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను రామ్‌నాథ్ కోవింద్ కోరారు. ప్రజలు దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారని అన్నారు