జిల్లాలో  ఈ నెల 25 వ తేదీ నుండి జనవరి 26 వరకు వికసిత్ భారత్ సంకల్ప్  యాత్ర 484 గ్రామ పంచాయతీల్లో నిర్వహణ యాత్ర విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన

*
ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడం ఈ యాత్ర ఉద్దేశ్యం
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రత్యేక పర్యవేక్షణ అధికారి కిరణ్ కుమార్
కర్నూలు,(సిరా న్యూస్);
జిల్లాలో  ఈ నెల 25 వ తేదీ నుండి జనవరి 26 వరకు వికసిత్ భారత్ సంకల్ప్  యాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో యాత్ర విజయవంతానికి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు.
బుధవారం  కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాల్ లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహణ పై జిల్లాకు ప్రత్యేక పర్యవేక్షకులుగా నియమితులైన ఐఆర్ఎస్ అధికారి,కేంద్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రెటరీ కిరణ్ కుమార్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో   జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  వికసిత్ భారత్ సంకల్ప్  యాత్ర 484 గ్రామ పంచాయతీల్లో నిర్వహించనున్నామన్నారు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందచేస్తున్న సహాయం, సంక్షేమ పథకాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్ గా, 36 శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షుడుగా 10,12 మంది  అధికారులతో  కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.. ప్రచార నిమిత్తం జిల్లాకు 4  వ్యాన్లు రానున్నాయన్నారు…కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందిస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా ఈ   కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు..నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వికసిత్ భారత్ సంకల్ప్  యాత్ర  కార్యక్రమాలు జరగాలన్నారు..  విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *