జగిత్యాల,(సిరా న్యూస్);
జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గెలుపు కోసం మూడేళ్ల చిన్నారులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు. ఇంకా కొందరు చిన్నారులు
కిడ్డి బ్యాంకుల్లో, పేరెంట్స్ పిల్లల అవసరాలకోసo ఇస్తే దాచుకున్న డబ్బులను సైతం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు ఇస్తూ ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ లభిస్తుండడంతో జీవన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
40 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉంటూ అందించారని ఈసారి జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే గా గెలిపించుకుంటామని గ్రామాల్లో ప్రజలు ఎవరికి వారే తామే అభ్యర్థిమనే భావించి ప్రచారం చేస్తున్నారు.
అలాగే జగిత్యాల పట్టణం అశోక్ నగర్ కు చెందిన సార ఆయాన్స్ రెడ్డి, సార అద్విరెడ్డి అనే మూడు సంవత్సరాల కవల పిల్లలు జీవన్ రెడ్డి గెలుపుకోసం కాంగ్రెస్ జెండాలు పట్టుకుని, ఆరు గ్యారంటీల కరపత్రాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
పెద్దలు, అమ్మలు, అక్కలు, అన్నలు, మామలు, తాతలు, అమ్మమ్మ, నానమ్మలు,ఉద్యోగులు, మేధావులతో పాటు అన్ని వర్గాల వారు చేతి గుర్తుకు ఓటువేసి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే జీవన్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే గా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేము మిమ్మల్ని కలుస్తూ తిరిగే వయస్సు కాకున్నప్పటికి ,కలువాలనే ఉత్సాహం ఉన్నది… ఈనెల 30 న జరిగే పోలింగ్ రోజు అన్ని తెలిసిన మీరందరు జీవన్ రెడ్డి చేతి గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అనంతరం మిమ్మల్ని తప్పకుండా కలుస్తామంటూ , మీ దీవెనలు జీవన్ రెడ్డికి, మా కు కూడా ఉండాలని సోషల్ మీడియాలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.