సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కోసం, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ తమ గ్రామాల్లో వార్డుల వారీగా ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి జోగు రామన్న మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత కరెంట్, వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, మరోమారు సీఎంగా కేసీఆర్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పక్కాగా అమలు అవుతాయని చెప్తున్నారు.
దీపాయిగూడలో…
జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో సర్పంచ్ బొల్లి గంగన్న ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కార్యకర్తలు స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ సంక్షేమ పథకాలను గురించి వివరిస్తున్నారు.
సిర్సన్న గ్రామంలో…
జైనథ్ మండలం సిర్సన్న గ్రామంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మద్దుల ఊషన్న జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే గా జోగు రామన్న ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెబుతున్నారు.
గిమ్మలో…
జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో ఎంపీటీసీ కోల భోజన్న, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కోల భోజన్న ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తోంది. కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే జోగు రామన్న గిమ్మ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారని మరో మారు ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి జోగు రామన్ననే ఎమ్మెల్యేగా గెలిపించాలని వారు కోరుతున్నారు.