సిరా న్యూస్, జైనథ్:
సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, బడుగు బలహీన వర్గాల హక్కులు, మహిళ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిబాపూలే అని, జ్యోతిబాపూలే సంఘం అధ్యక్షుడు పరమేశ్వర్ అన్నారు. అదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో జ్యోతిబాపూలే 133 వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘం సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం జ్యోతిబాపూలే వర్ధంతినిbఅధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాల్లో ఆయన జీవిత చరిత్రను చేర్చాలని, ఆయనకు భారతరత్న ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు సందీప్ చౌదరి, అశోక్ చౌదరి, ఇతర సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.