సిరా న్యూస్, గాజువాక:
గాజువాక బిసి రోడ్ నుండి పెద గంట్యాడ వరకు టిడిపి జనసేన పార్టీలు కలిపి ధర్నా నిర్వహించాయి. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను మరమ్మత్తులు చేయాలని రాస్తా రోకో చేసారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందచేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గాజువాక తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర జనసేన పీఏసీ సభ్యులు కోన తాతారావు. టిడిపి మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు