రెండు వారాలలకు మించి దగ్గు జ్వరం ఉంటే తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి
అవగాహన కార్యక్రమం నిర్వహించిన హుమానా పీపుల్ టూ పీపుల్ ఇండియా
హైదరాబాద్ , (సిరా న్యూస్);
\లీడ్ ప్రాజెక్ట్ లో బాగంగా హుమానా పీపుల్ టూ పీపుల్ ఇండియా స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో టిబి నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పాటశాల విద్యార్థులతో అవగాహన ర్యాలి ని నిర్వహించారు. కంటోన్మెంట్ పికెట్ లక్ష్మీనగర్ ప్రభుత్వ ప్రాథమిక బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాటశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు అనేకమంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా టిబి ( క్షయ వ్యాధి ) ఎలా వస్తుంది వాటి లక్షణాల గురించి వక్తలు వివరించారు.ఈ సందర్బంగా పోగ్రాం సీపీఎల్ మితిలేష్ శర్మ మాట్లాడుతూ 2 వారాలలకు మించి దగ్గు జ్వరం బరువు తగ్గడం ఉంటే తప్పకుండా తెమడ లేదా ఎక్సరే (xray) పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ చేసుకుని మందులు వెంటనే వాడాలని ఇతరులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ తప్పక వాడాలని తెలియజేశారు. సమస్య లు ఉంటే వెంటనే సమీపం లోని టీబీ యూనిట్ లో సంప్రదించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సినియర్ టీబీ సుపర్వెజర్ నవీన్,ప్రిన్సిపాల్ శైలజ,ప్రభుత పి ఈ టి స్కూల్ టీచర్ సాయి లత,పాజెక్ట్ సూపర్వైజర్ జుబేర్ ఖాన్,ఫీల్డ్ ఆఫీసర్స్ నవీన , అమృత ,మంజులత , సంధ్య , రేణుక , దినకర్ తదితరులు పాల్గొన్నారు.